TS CLASS 10 Telugu 2 ఎవరి భాష వాళ్ళకు వినసొంపు
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు?
జ. మనుమరాలుకు తెలుగురాదు. హైదరాబాద్లో ఉంటుంది. హిందీలో మాట్లాడుతుంది. తెలుగువాళ్ళ పలుకుబడిగాని, నుడికారము శానీ తెలియదు. అలాంటి నాలుగు సంవత్సరాల మనుమరాలు తాతతో "తాతా ! ఇగపటు నీ పాను, జర్దా డబ్బీ" అని అంటుంది. 'పట్టు' అనగానే తమ ప్రాంతపు తీయని తెలుగు. మనమరాలికి పట్టుబడ్డందుకు తాతా అబ్బుర పడ్డాడు. ఆనందించాడు.
ఆ) కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారిని రచయిత గురుస్థానీయులుగ ఎందుకు భావించారో వివరించండి.
జ. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారు సంస్కృతాంధ్ర భాషల్లో ఉద్ధండ పండితులు. ఆంధ్ర బిల్హణ బిరుదాంకితులు. వీరి రచనల మన రచయిత ప్రభావితులు అయ్యారు. అవకాశం దొరికినప్పుడల్లా శాస్త్రిగారి వద్ద కూర్చుని మన రచయిత అనేక విషయా నేర్చుకునేవారు. తరచుగా జాబులు రాస్తూ సాహిత్య విషయాలు తెలుసుకొనేవారు. అందుకే కప్పగంతుల లక్ష్మణశాస్త్రి గారి రచయిత గురుస్థానీయులుగా భావించారు.
ఇ) "అందరు యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవిన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటి?"అని రచయిత అనుకోవడంలో ఉద్దేశమేమై ఉంటుంది?
జ. విషయ పరిజ్ఞానం, భాషపై పట్టు మిగిలిన వారి కంటే యూనివర్శిటీ ఆచార్యులకు, ఎక్కువగా ఉంటుంది. ఎంతో మంది తెలుగు విద్వాంసులు, యూనివర్శిటీ ఆచార్యులు హాజరైన కాళోజీ జయంతి సభకు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడమేమిటని రచయిత ఉద్దేశం. కల్తీలేని, స్వచ్ఛమైన వరంగల్ తెలుగులో అధ్యక్షోపన్యాసం విన్న తరువాత రచయిత తన అభిప్రాయాన్ని మార్చుకుంటారు.
ఈ) రచయిత రచనా శైలిని ప్రశంసిస్తూ రాయండి.
జ. డా॥ సామల సదాశివ రచనలు సూటిగా, స్పష్టంగా, నిర్ధిష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా ఉంటాయి. ముచ్చట్ల రూపంలో మనస్సుకు హత్తుకుపోయేటట్లు ఉంటాయి. వీరి రచనల్లో భాష సహజంగా, సుందరంగా, సరళంగా ఉంటుంది. వీరి రచనల్ తమ ప్రాంత భాష పలుకుబడులను, నుడికారాలు, జాతీయాల మాధుర్యాన్ని చవిచూడవచ్చు. ఇళ్లలో సామాన్యులు మాట్లాడుకు భాషే పుస్తక భాషగా, ప్రామాణిక భాషగా ఉండాలనేది వీరి ఆకాంక్ష.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) ఈ పాఠం ద్వారా సామల సదాశివ గురించి మీకేమర్థమయిందో రాయండి.
జ. డా॥ సామల సదాశివ బహుభాషా కోవిదులు. ఒకప్పుడు గ్రాంథిక భాషలో పుస్తకాలు రాసినప్పటికీ తరువాత కాలంలో వ్యవహారిక భాష ప్రాధాన్యతను గుర్తించి, ఆ భాషలోనే రచనలు చేశారు. నాలుగేళ్ల మనుమరాలు 'ఇగపటు' అంటూ మాట్లాడగానే తమ ప్రాంతపు తీయని తెలుగు పట్టుబడ్డందుకు ఎంతగానో మురిసి పోయేటంతటి ప్రాంతీయ భాషాభిమాని. సాహితీ ప్రముఖుల జీవిత ఘట్టాలను నిశితంగా పరిశీలించి సందర్భోచితంగా యాది చేసుకునేటంతటి విశాల హృదయులు.
కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, గడియారం రామకృష్ణశర్మ, శ్రీ వేలూరి వంటి ప్రముఖుల రచనలకు ప్రభావితమై ఎన్నో విషయాలు వారి వద్ద నేర్చుకుని వారిని గురుతుల్యులుగా భావించేటంతటి సంస్కారి, కాళోజీలాంటి ప్రముఖుల జయంతి, వర్ధంతి సభలకు పిలవక పోయినా వెళ్ళేటంతటి సహృదయులు డా॥ సామల సదాశివ. మంచి ఏ భాషలో వున్నా, ఏ ప్రాంతంలో వున్నా గుర్తించి.. గౌరవించగల హృదయ సంస్కారి. అన్నీ ప్రాంతాల పలుకుబళ్ళనూ, జాతీయాలను తెలుగు భాషలో కలుపుకుని ప్రజల వాడుక భాషకు పట్టం కట్టాలనేది వీరి ఆకాంక్ష.
3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
అ) మీ ప్రాథమిక విద్యాభ్యాస జీవితంలో మీరు మరచిపోలేని జ్ఞాపకాలను ఒక వ్యాసంగా రాయండి
జ. నా ప్రాథమిక విద్యాభాసం బెజ్జూరు మండలపరిషత్ ప్రాధమిక పాఠశాలలో జరిగింది. మూడో తరగతిలో నేను బడికి వెళ్ళకుండా ఇంటివద్దనే వుండి గాలికి తిరుగుతూ ఉండేవాడిని. తల్లిదండ్రులు కూలీలు కావడంతో ఇంటిపట్టున ఉండేవారు కాదు. నేను బడికి వెళ్ళకపోయినా పెద్దగా పట్టించుకునేవారుకాదు. అప్పటి మా తరగతి ఉపాధ్యాయులు శంకర్ సార్ పిల్లల్ని ఇంటికి పంపించారు. కాని నేను తప్పించుకుని పారిపోయి దాక్కునేవాడిని. ఓ రోజు నలుగురు పిల్లల్ని తీసుకుని సారే ఇంటికి వచ్చి పట్టుకుని మరీ బడికి తీసుకువెళ్ళారు. దగ్గర కూర్చోబెట్టుకుని చదువు చెప్పారు. మా శంకర్ సార్ లేకుంటే నేను ఇక్కడ వరకు వచ్చేవాణ్ణికాదు. మా నాలుగో తరగతి సార్ సుబ్బారావు గారు, నేను లెక్కలను కచ్చితంగా, వేగంగా చేయడాన్ని గమనించి. మెచ్చుకునేవారు. వారి ప్రోత్సాహం మరువలేనిది. ఐదవ తరగతి బోధించిన మల్లేశం సార్ ఇంగ్లీషు చాలా బాగా చెప్పారు. పలకడం రాకపోతే అనేకమార్లు చెప్పి పలికించేవారు. పిల్లలందరం కలిసి మెలసి ఆడుతూ, పాడుతూ చదువుకునేవాళ్ళం. ఐదవ తరగతి పూర్తవగానే పాఠశాలలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో స్నేహితులందరం పాఠశాల వదలి వెళ్తున్నందుకు కంటతడి పెట్టుకున్నాం. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళముందు కదులాడుతూనే వుంది.