Kottabata 4th lesson 10th class

 




వ్యక్తీకరణ - సృజనాత్మకత 

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లోజవాబులు రాయండి
అ) "ఎంత చెడ్డగాని, ఎంత బాగా బతికిన గని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితే సాలు" అన్న అక్కమాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జ. ఎంత చెడ్డగా అయినా, ఎంత ఉన్నతంగా అయినా బతికేటప్పుడు వేరే సహాయంతో జీవిత వారి సాగిచడం మంచిది కాదని అక్క అంది. అలా ఎందుకు అన్నదంటే ఇతరులపై ఆసరాతో జీవితం కొనసాగితే తగిన గౌరవం దక్కదు. చేతకానివాడు అని తక్కువ అంచనా వేస్తారు. ఏది మాట్లాడినా 'వాడు ఇతరులపై ఆధారపడతాడు' అనే భావన వెంటాడుతుంది. అక్క మాటల్లో ఆంతర్యం గమనిస్తే జీవితం. హాయిగా గడవాలని అర్థమవుతుంది.
ఆ) "అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తున్నవి” అంటే మీకేం అర్థమైంది?
జ: 'అదును గాయడం' అంటే అవకాశం కోసం కనిపెడుతుంటాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు. ఏ జంతువైనా వేటాడితే ఆ తినగా మిగిలిన మాంసాన్ని తినడానికి ఎదురు చూడటం నక్క లక్షణం కథలో ఈ విషయం వర్ణించడంలో నక్కల లక్షణంతోపాటు, నక్క లక్షణాలున్న మనుషులు కూడా మనచుట్టూ పొంచి ఉన్నారని చెప్పడం రచయిత్రి ఉద్దేశం.
ఇ) మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
జ: మా గ్రామంలోని (ప్రకృతి అందమైన హరివిల్లుగా ఉంటుంది. ప్రతి ఇంటిముందు పచ్చని మైమరపిస్తు -ంది పక్షుల కిలకిలరావాలు, అంబా అని అరిచే లేగదూడల విన్యాసాలు నిత్యం ప్రకృతితో సయ్యాటలాడుతాయి. పచ్చని పొలాల నుంచి, వీచే పైరగాలి మా గ్రామానికి పరవశాన్ని అందిస్తుంది. మా గ్రామంలో ప్రకృతి మంచి మనుషుల మనసులా కళకళలాడుతుంది.
ఈ) చెరువుల ప్రాముఖ్యత ఏమిటి?
జ: చెరువుల వలన చాలా ఉపయోగాలున్నాయి. చెరువుల వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. ఎండవేడి తెలియదు. పశువులు పక్షులు, మనుషులకు త్రాగడానికి నీటికి లోటుండదు. వ్యవసాయానికి కూడా ఆ నీరు ఉపయోగపడుతుంది. పశువులకు వేరే చెరువు ఉండాలి. అది పశువులను కడగడానికి, బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తుంది. మంచినీటి చెరువు వేరే ఉండాలి. చెరువులున్న గ్రామంలోకి కరువు రాదు
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి.
:పల్లెల్లో ఆనాడు దారులన్న వర్షంవస్తే బురదమయంగా మారేవి ఇప్పుడు ప్రతీ పల్లెకు మంచిదారి ఏర్పాటయ్యింది. అప్పట్లో ఆడవారు ఇంట్లోనే ఉండేవారు. పర్దా పద్దతి ఉండేది. ఇప్పుడు. అన్ని రంగాల్లో పల్లెల్లోని మహిళలు సైతం ముందుంటున్నారు. దొంగతనాలు, దోపిడీలు, బండలుర్వులు లాంటివి ఇప్పుడు లేవు కులమత భేదాలు సమసిపోయాయి. పట్టణాలలో ఉండే నేడు పల్లెల్లో వినియోగిస్తున్నారు. నాడు భూస్వాములు | అధికంగా పని చేయించుకునేవారు. శ్రమకు తగిన డబ్బు ఇచ్చేవారు కాదు. అమాయకులను మోసం చేసేవారు. మత్తలకు (వడ్డీలను) డబ్బులిచ్చి అధికంగా వసూలు చేసేవారు. కానీ ఈనాడు చిన్న, పెద్ద అందరూ అలాంటి మోసాలను ఎండగడుతున్నారు. పిల్లలంతా సభ్యత సంస్కారంతో పరిశుభ్రంగా ఉంటున్నారు. పటేల్ నం. దొరపాలన ఆనాడు ఉండేది. ఇప్పుడు.. లేదు.
 
3. కింది ప్రశ్నకు సృజనాత్మకంగా సమాధానం రాయండి. “
అ) పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవిత రాయండి.
వెలతిలేని అనుబంధాలు - వెనక్కి తగ్గని ధైర్యాలు చిగురు పూసిన ప్రేమలు - చిందులు వేసే యువకులు
జ:పచ్చని చెట్లు, పంటపొలాల మాపల్లె. చల్లని గాలి, చక్కని నీటితో విలసిల్లే పాడి పంటలతో, పశు సంపదతో మా పల్లె కళకళలాడుతు,హాయిని గొలుపుతు విలసిల్లే బడులు, గుడులు చక్కని బాటల మా పల్లె. నీటి పంపులతో, విద్యుత్ కాంతితో విలసిల్లే. ఆప్యాయతల, అనురాగాల మా పల్లె. చదువు సంధ్యలతో, ధనధాన్యాలతో విలసిల్లే పండుగలూ, పేరంటాలతో మా పల్లె కళకళలాడుచు సిరిసంపదలతో విలసిల్లే