TS Class 10 Telugu 1.Daana sheelamu






కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) 'ఈ కుబ్జుండు అలఁతింబోడు' అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశమేమై ఉంటుంది? దానితో మీరు ఏకీభవిస్తారా?
జ. శుక్రాచార్యుని మాటతో పూర్తిగా ఏకీభవిస్తాను. ఎందుకంటే
1. శుక్రాచార్యుడు గురువుగారు కనుక తన శిష్యుని మేలు కోరాడు.
2. మానవుల యొక్క నిజస్వరూపాన్ని గమనించగల శక్తి గురువులకు ఉంటుంది. శుక్రాచార్యుడు దివ్యదృష్టి కలవాడు.
3. వామనుని నిజస్వరూపం శుక్రాచార్యులకు తెలుసు.
4. తన శిష్యుని కాపాడాలని శుక్రాచార్యుల ఉద్దేశం.
5. రాక్షస రాజ్యం నిలబెట్టాలని శుక్రాచార్యుల ఆకాంక్ష.
ఆ) హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు తృప్తి జెందుతాడు?
జ. ప్రాధమికంగా రైతుకు కావలసిన వసతి సౌకర్యాలలో మొదటిది సారవంతమైన నేల, రెండవది నాణ్యమైన విత్తనాలు. ఆ తర్వాత నీటి వసతి, గిట్టుబాటు ధర అవసరమైనచో నిలువ చేసుకొనుటకు గిడ్డంగులు మొదలగు సౌకర్యాలు అవసరం.
ఇ) 'సిరి మూట గట్టుకొని పోవం జాలిరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యమేమై ఉంటుంది?
జ.ఏదేమైనప్పటికినీ నేను ఇచ్చినమాట తప్పను అని బలిచక్రవర్తి తన గురువు శుక్రాచార్యునితో పలికిన సందర్భం తానిచ్చిన మాట వలన తన సర్వస్వం కోల్పోవలసి వస్తుందని తెలిసినా మాటకు కట్టుబడి ఉండటం అతని యొక్క నిబద్దతకు తార్కాణం.
ఈ) 'ఆడినమాట తప్పగూడదు' - ఎందుకు?
జ.లోకంలో గృహస్థులు దానం, ధర్మం పాటించాలని మన పూర్వీకుల నుండి ఆనవాయితిగా వస్తున్న సంస్కృతి. ఇచ్చిన మాట తప్పటం కంటే పాపం లేదని పెద్దలు అంటారు. భూదేవి కూడా "ఎటువంటి చెడ్డపని చేసిన వాడినైనా భరిస్తానుగానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం క్షణం కూడా మోయలేను" అని బ్రహ్మతోటి అన్నదట. అందుకే ఆడిన మాట తప్పటం కూడదు.
కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
) నేటి సమాజానికి దానగుణంగల వ్యక్తుల అవసరమేమిటో వివరించండి.
జ.సమాజంలో నేడు ప్రపంచీకరణ వలన ప్రపంచం మొత్తం గ్రామంగా మారుతున్నది. కానీ వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. సమాజంలో ధనికుల సంఖ్య కంటే పేదవారి సంఖ్య పదింతలు పెరిగిపోతున్నది. ఆకలికి, దాహానికి, నీడకు, కరువై అలమటిస్తున్నవారి సంఖ్య లక్షల సంఖ్యలలో వుంటున్నది. అందుకనే నేటి సమాజానికి దాతృత్వం గల వ్యక్తులు అవసరం. దాతృత్వం గల వ్యక్తులు సామాజిక సేవకోసం కొంత ఆదాయాన్ని ఖర్చు పెట్టటం ఇవాళ ఒక మంచి అలవాటుగా ఉన్నది. సమాజంలో విద్యకు సుదూరంగా ఉన్న విద్యార్థుల కోసం పాఠశాలలు ప్రారంభంచటం, కనీసం త్రాగునీటి సౌకర్యం లేని పల్లెలకు మంచినీరు అందజేయటం. పలురకాల అనారోగ్యాలు విజృంభిస్తున్న ఈ రోజుల్లో కనీస ప్రథమ చికిత్సకు కూడా దూరమవుతున్న సామాన్య ప్రజలకు కనీస వైద్యం అందజేయటం, వంటివి ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలకు పూర్తిగా సాధ్యమయ్యే పని కాదు. అందువలన దాతృత్వం కలిగిన వ్యక్తులు నేటి సమాజంలో అవసరం. అంతేకాదు రక్తదానం, అవయవదానం, శరీరదానం చేయగల వ్యక్తుల కూడా నేటి సమాజానికి అత్యవసరం.
ఆ) పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జ.శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఓ రాజా! నీ వంశాన్ని, రాజ్యాన్ని తేజస్సును నిలుపుకో! వామన రూపంలో వచ్చినవాడు విష్ణుమూర్తి. ఇతడు మూడు అడుగులతో మూడు లోకాలను ఆక్రమించగలడు. ఈ విశ్వమంతా నిండిపోతాడు. కాబట్టి నీవు ఈ దానం చేయొద్దు ఈ వామనున్ని పంపిచివేయి అని చెప్పాడు.గురువుగారి మాటలు విన్న బలిచక్రవర్తి ఓ మహాత్మా మీరు చెప్పింది నిజం. అయితే ఏది అడిగినా ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ధనంపై దురాశతో లేదని పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం మరొకటి లేదు. దాతకు తగినంత ధనం దానిని గ్రహించుటకు సరియైన వ్యక్తి దొరకడం బహు అరుదు. ఆ అవకాశం నాకు లభించడం అదృష్టం. ఆచార్యా! పూర్వం రాజులున్నారు. వారికి రాజ్యాలున్నాయి. వారెవ్వరు వారి సంపదలనుతమతో మూటగట్టుకొని పోలేదు. అటువంటి రాజులను ఇప్పుడు ఎవరూ తలచుకోవడం లేదు. కాని శిబిచక్రవర్తి వంటి కొంత మంది దాతలను నేటికీ జ్ఞాపకం చేసుకొంటున్నాం. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా విష్ణుమూర్తిని చూడటం సాధ్యం కాదు. అటువంటి గొప్పవాడు రూపం మార్పు కొని వామన రూపంలో వచ్చి దానం అడిగితే తప్పకుండా ఇస్తాను. ఇది నాకు కలిగిన అదృష్టంగా భావిస్తాను. నాకు నరకం దాపురించినా, కారాగారం ప్రాప్తించినా ఈ భూమడలం నాశనం జరిగినా, దుర్మరణం సంభవించినా, నా వంశం అంతరించినా ఏమైనా కాని ఏదైనా రాని నేనిచ్చిన మాట తప్పను. అని బలిచక్రవర్తి శుక్రాచార్యునితో అన్నాడు.
అదే సమయంలో బలిచక్రవర్తి సైగను గమనించి భార్య వింధ్యావళి బంగారు కలశంతో నీరు తెచ్చింది. ఆ నీటితో బలి వామనుడి పాదాలు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు. బలిచక్రవర్తి వామనున్ని పూజించి అతడికి మూడు అడుగుల నేలను దానం చేశాడు. అవుడు పంచభూతాలు, దశదిశలా బలిచక్రవర్తిని భళీ భళీ అని మెచ్చుకున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్త్వం దాత లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి బలిచక్రవర్తి. ఇలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి.
కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి.
అ) ఆడినమాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం అనే విషయాల పై నినాదాలు,సూక్తులు రాయండి
జ.1) ఇచ్చిన మాట, చేసినదానం తిరిగి తీసుకోరాదు. 
2) అన్ని దానాల్లో భూదానం గొప్పది.
3) ఇచ్చిన మాట నిలబెట్టుకో - మంచి పేరు తెచ్చుకో.
4) మాట తప్పనేల - మడమ తిప్పనేల.
5) మూట ఇవ్వు తరిగిపోతుంది - మాట ఇవ్వు పెరిగిపోతుంది.