TELANGANA SSC BOARD TELUGU PAPER 2023


TELUGU FIRST LANGUAGE
 CLASS 10 SSC QUESTION PAPER 2023


I. అవగాహన - ప్రతిస్పందన (20 మార్కులు)

(ఆ) కింది పేరాను చదివి, ఖాళీలను పూరించండి.

సముద్రంపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయ పడదలిచాడు. తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం. ఆ ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలుగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు. అతని బంగారు గిరి శిఖరాల మీద హనుమంతుడు ఒకింతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరేనన్నాడు. ఒక్కసారిగా సముద్రం మధ్యనుంచి పైకి లేచాడు. అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలచాడు మారుతి. తన ఎదతో నెట్టివేశాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవరూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు. సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో 'నీ ఆదరపూర్వకమైన మాటలకు తప్తి పడ్డాను. ఆతిథ్యం అందుకున్నట్లే భావించు.సమయం లేదు. ఆగడానికి వీలులేదు.' అని చెప్పి చేతితో అతణ్ణి తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు.

హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురప అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది. కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్ళతో సింహికను చీల్చేశాడు.


ప్రశ్నలు :

1.హనుమంతునికి సహాయపడదలచినవాడు ........….…........

2.హనుమంతుడు మైనాకుణ్ణి తన ఎదతో నెట్టివేయడానికి కారణం ......................

3. .................... రూపంలో మైనాకుడు కనిపించాడు.

4. హనుమంతుని పరీక్షించి, ఆనందించి ఆశీర్వదించిన వారు ...........................

5. హనుమంతుడు సింహికను చీల్చి చంపడానికి కారణం

(ఆ) కింది పద్యాలలో ఏదైనా ఒక పద్యాన్ని పూరించి భావం రాయండి.

6. ఊరూరం జనులెల్ల

................…... శ్రీకాళహస్తీశ్వరా!

        లేదా


కారే రాజులు? రాజ్యముల్ ................... భార్గవా!


(ఇ) కింది పేరాను చదువండి. ఇచ్చిన ప్రశ్నలకు 1, 2 వాక్యాలలో జవాబులు రాయండి.

రాజు తాతను ఇలా ప్రశ్నించాడు. "తాతా! నీ మనుమడు రెండు చంక కర్రలతో గాని నడువ లేకుండా ఉంటే, నీ కొడుకు ఒక కర్ర ఊతతో నడుస్తున్నాడు. నువ్వు ఏ సాయం అక్కర్లేకుండానే నడువగలుగుతున్నావే? నీ కళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి. చెవుడు రాలేదు. పళ్ళు ఊడలేదు. నీకూ నీ మనుమడికి యీ తేడా యెందుకుంది? చెప్పు?”

తాత ఇలా జవాబిచ్చాడు. "ప్రభూ! ఇట్లా జరగడానికి కారణం లేకపోలేదు. ఇదివరలో మానవులు తమ శ్రమ మీదే ఆధారపడి జీవించేవాళ్ళు. ఇప్పుడో చాలామంది ఇతరుల కష్టంమీద ఆధారపడి సోమరులుగా బ్రతుకుతున్నారు. పూర్వం అంతా ప్రకృతి శాసనాలను అతిక్రమించకుండా జీవించారు. తను శ్రమపడి ఉత్పత్తి చేసిన వస్తువులతోనే గడుపుకొనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇతరుల వస్తువులకై మనస్సులో కూడా వాంఛించడం పాపంగా యెంచేవాళ్ళు. ఇప్పుడు కాలుమీద కాలేసుక్కూర్చొని అందరికంటే బాగా తినడమే గొప్ప సంగతిగా భావిస్తున్నారు. ఇదే తేడా, అప్పటికీ ఇప్పటికీ. అందువల్లనే పంటలూ క్షీణించాయి. మనుష్యుల జవసత్వాలూ ఉడుగుతున్నాయి.”


ప్రశ్నలు :

7. పై పేరాలో ఎవరెవరి మధ్య సంభాషణ జరిగింది?

8. రెండు కర్రల సహాయంతో నడుస్తున్నది ఎవరు?

9. ఒకప్పుడు మానవులు దేనిమీద ఆధారపడి జీవించేవాళ్ళు.

10. ఈ కాలంలో దేన్ని గొప్ప సంగతి అనుకుంటున్నారు?

11. తాత, కొడుకు, మనవడు - ఈ ముగ్గురిలో ఎవరు ఆరోగ్యంగా, ధృఢంగా ఉన్నారు?


II. వ్యక్తీకరణ - సృజనాత్మకత (40 మార్కులు)

(ఆ) కింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి.

12. దాశరథి కష్ణమాచార్యులు గురించి రాయండి.

13. జీవనభాష్యం పాఠంలో వేటిని అలవరుచుకోవాలని కవి సూచించాడు?

14. లావణ్య పలికిన మాటలు ఏమిటి? ఆ మాటలకు సామల సదాశివ ఎందుకు ఆనందించాడు?

15. 'గోలకొండ రాజ్యం' లో కవులకు, పండితులకు ఉన్న ఆదరణ ఎటువంటిది?

(ఆ) కింది ప్రశ్నలకు 10 నుండి 12 వాక్యాలలో జవాబులు రాయండి.

16. నగర జీవనంలోని అనుకూల మరియు ప్రతికూల అంశాలు ఏమిటో వివరించండి.

లేదా

కాశీ నగరంలో వ్యాసుడు భిక్షను పొందిన విధానమును తెలుపండి.

17. "అవును, ఇది కొత్త బాటనే! ఇంతకంటే కొత్త బాట, మంచి బాట ఇంగెట్లుంటది?” అని అక్క ఎందుకు అనుకున్నదో వివరించండి.

లేదా

భూమిక పాఠం ఆధారంగా చార్మినార్ కథల గురించి రాయండి.

18. రామాయణం ఆధారంగా అన్నదమ్ములంటే ఎట్లా ఉండాలో వివరించండి.

లేదా

'మంచివారితో స్నేహం చేయడం వల్ల చాలామేలు జరుగుతుంది.' అనే విషయాన్ని రామ-సుగ్రీవ, రామ-విభీషణుల స్నేహ వత్తాంతాల ద్వారా వివరించండి.

(ఇ) సృజనాత్మకత

19. 'మంచి పుస్తకాలు మంచి మిత్రుని వలె ఎల్లప్పుడు తోడుంటాయి. గ్రంథాలయాలకు వెళ్ళడం, పుస్తకాలు చదువడం ఒక అలవాటుగా మారాలి.' ఈ విషయం గురించి ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నట్లుగా 'సంభాషణ' రాయండి.

లేదా

దేశానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టి, ఉత్తమ క్రీడాకారుడిగా అవార్డులు పొందిన ఒక క్రీడాకారుణ్ణి ఇంటర్వ్యూ చేయడానికి ‘ప్రశ్నావళి'ని తయారు చేయండి.