telugu 6th lesson
వ్యక్తీకరణ - సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
అ)చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి.
జ. విద్యలేనివాడు వింత పశువు' అని పెద్దలు అంటారు. చదవటం, రాయడం, లెక్కలు నేర్చుకోవడమే అక్షరాస్యత. చదువుకుంటే ఎవరిమీద ఆధారపడకుండా జీవితాన్ని సాగించవచ్చు. ఏది మంచి, ఏది చెడు' అనే విచక్షణా జ్ఞానం కలుగుతుంది. సమాజంలోని మూఢనమ్మకాలను, సాంఘిక దురాచారాలను రూపుమాపవచ్చు. సామాజిక అసమానతలు తొలగిపోతాయి. ఉపాధి దొరుకుతుంది. నేను ఎవ్వరి కంటే తక్కువ కాదు' అన్న ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఇలా చదువు మానవుని జీవన వికాసానికి బాటలు వేస్తుంది.
ఆ) అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి?
జ. అందరూ చదువు కోవాలి. అందరికీ సమానంగా చదువుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పించాలి. బడుగు, బలహీన వర్గాలు విద్యావ్యాప్తికి ప్రత్యేకంగా కృషి చేయాలి. వారిలో 'అందరి లాగా మేము అన్ని చేయగలం' అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ప్రభుత్వం చొరవ చూపి వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి. వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. కుల, మత వివక్షను రూపుమాపటానికి ప్రత్యేక చట్టాలను రూపొందించి, పటిష్టంగా అమలు చేయాలి. అప్పుడే సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగి సమ సమానత్వం పరిఢవిల్లుతుంది.
ఇ) అంకిత భావంతో పనిచేయడం అంటే ఏమిటి ?
జ. ఒక లక్ష్యం కోసం దీక్షతో పనిచేయడాన్ని అంకిత భావంతో పనిచేయడం అంటారు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చి విడిచి పెట్టుకూడదు. లక్ష్య సాధన దిశగా మనపని మనం చేసుకుంటూ పోవాలి. డా॥ బి.ఆర్. అంబేద్కర్, మ లాంటి వారు అంకిత భావంతో కృషి చేయడం వల్లనే సమాజంలో ఎన్నో సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సమ కృషి చేయాలనుకునే నాయకులను అంకితభావం, చిత్తశుద్ధి, నిజాయితీ అవసరం.
ఈ) వ్యసనాల వలన ఎట్లాంటి నష్టాలు కలుగుతాయి ?
జ. తాగుడు, జూదం లాంటి వ్యసనాలకు బానిసలవడం వలన వ్యక్తులు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. ఆరోగ్యం క్షీణిస్తుంది శ్రీ గౌరవ మర్యాదలు తగ్గి పోతాయి. ఆర్థికంగా పతనమౌతారు. వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతారు. కుటుంబాలు విచ్చిన్నమౌతాయి నేర ప్రవృత్తి పెరుగుతుంది. తద్వారా సమాజాభివృద్ధి కుంటుపడుతుంది.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాలలో జవాబులు రాయండి.
అ) మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారదోలడానికి మీరు ఏం చేయగలరు?
జ. సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలకు ప్రజల అజ్ఞానం కారణం. అజ్ఞానం పోవాలంటే అందరూ చదువుకోవాలి. అందరూ చదువుకునే విధంగా ప్రోత్సహిస్తాను. పని పాటలు చేసుకొనే నిరక్షరాస్యులకు రాత్రి బడులు ఏర్పాటు చేసి, వారి విద్యావ్యాప్తికి కృషి చేస్తాను. ముఖ్యంగా మహిళలో అక్షరాస్యత పెంపొందించటానికి కృషిచేస్తాను. మూఢ నమ్మకాలు పోగొట్టటానికి వాటికి సహేతుకమైన వివరణ యిచ్చి సమాజాన్ని చైతన్య పరుస్తాను. కర పత్రాలు, సభలు, సమావేశాల ద్వారా ప్రజల్లో మూఢనమ్మకాల వలన కలిగే నష్టాలను వివరిస్తాను. జన విజ్ఞాన వేదిక, ఇతర స్వచ్చంద సంస్థల సహకారంతో ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాను. శాస్త్ర, సాంకేతిక ఫలాలు సామాన్య ప్రజలకు అందేటట్లు కృషి చేస్తాను. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించడానికి, ప్రభుత్వం చొరవ చూపాలి. అందుకు కృషి చేస్తాను.
ఆ) భాగ్యరెడ్డివర్మ ఆదిహిందువులకోసం చేసిన కృషిని వివరించండి.
జ. భాగ్యరెడ్డి వర్మ నిమ్నజాతుల్లో ఉన్న అజ్ఞానాన్ని, ఉదాసీనతను గుర్తు చేశారు. అణగారిన కులాల వికాసానికి తన తెలివితేటలు వినియోగించారు. చిత్తశుద్ధి, నిజాయతీ, పట్టుదలతో నిమ్నజాతులను జాగృతం చేశారు. చదువు గొప్పదనాన్ని. తెలుసుకునేలా చేశారు. చదువు మూలంగా కొన్ని సాంఘిక దురాచారాలు లేకుండా చేయగలిగారు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగారు. దేవదాసీ, ముర్జీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకుని నిరసించారు. తాగుడును మానిపించారు. ప్రతి సభలో పాల్గొని తన జాతి జనులు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. అంటరానివర్గాల వారిని అది హిందువులుగా నమోదు చేయించారు. పాఠశాలలు ఏర్పాటు చేయించి అందరూ. చదివేలా చూశారు. అందరిలో నిమ్న జాతుల వారు సమానమేనని నిరూపించారు.
కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
అ) భాగ్యరెడ్డివర్మ గురించి తెలుసుకున్నారు కదా! ఇట్లాగే సమాజం కోసం పాటుపడిన వాళ్ళలో ఎవరి గురించైనా 'అభినందన' వ్యాసం రాయండి.
జ. విప్లవాభివందనం
విప్లవయోధుడా! తెలంగాణ తల్లి ముద్దుబిడ్డా! లక్ష్మీనారాయణ ముదిరాజ్ నీకు అభినందనలు నీవు 1929లో జన్మించేపు తెలంగాణ వెలుగ కిరణంలా రాజకీయాలలో ఒకవెలుగు వెలిగావు దీపంలా. నువ్వు మామూలు దీపం కాదు. విప్లవజ్యోతివి. ప్రజాభిమానంతో శాసన శుభము పెడితివి హైదరాబాద్ మేయర్గా ఖ్యాతినార్జించితివి. రజాకార్లతో ఢీకొన్నావు. క్విట్ఇండియా ఉద్యమమూ నడిపేవు. 1969లో అద్భుతమైన పనిచేశావు. అదే 'గన్వార్కు' శంఖుస్థాపన చేయించేవు. జోహర్ లక్ష్మన్నా! జోహార్!