TS CLASS 10 TELUGU 10 LESSON గోలకొండ పట్టణము

              వ్యక్తీకరణ - సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) "గోలకొండ పాదుషాలు సాహిత్య పోషకులు" అనడానికి ఉదాహరణలు తెలుపండి.
జ.గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్షా సాహితీ ప్రియులు. వీరు కవులు, పండితులను గౌరవించి, సత్కరించారు. అద్దంకి గంగాధర కవి రచించిన 'తపతీ సంవరణోపాఖ్యాన కావ్యము' వీరికి అంకితమివ్వబడినది. అలాగే పొన్నగంటి తెలగనార్యునిచే రచించబడిన 'యమాతి చరిత్ర'ను ఇబ్రహీం పాదుషా సేనాని అమీరాఖాన్ అంకితం స్వీకరించి కృతికర్తను సత్కరించారు. పాదుషాలు కవి పండితులకు అగ్రహారాలను ఇచ్చి సత్కరించారు.

ఆ) నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్ఛస్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు?
జ.ఆనాటి తెలంగాణలో తెలుగు భాష చాలా ఉచ్ఛస్థితిలో ఉండేది. ఇబ్రహీం కుతుబ్షాను కవులు కీర్తించేవారు. తెలుగు కవులను సన్మానించేవాడు. తెలుగు భాష మాధుర్యాన్ని స్వయంగా చవిచూసినవాడు. అద్దంకి గంగాధరకవి, ఆ సూర మరింగంటి సింగరాచార్యులుగారు వంటి మహా కవులను పోషించారు.
ఇ) "తెలంగాణము ఈజిప్టువలె ప్రపంచపు అంగడి" అనడానికి కారణాలు రాయండి.
జ.ఆ రోజులలో గోలకొండ పట్టణములోని బజార్లలో చిల్లర వస్తువులు, తినుబండారాలు, విలాసవస్తువులు, నగలు, నాణెములు, విరివిగా అమ్మేవారు. గోలకొండ వ్యాపారులు విదేశాలతో వ్యాపారం చేసేవారు బాగా డబ్బు సంపాదించేవారు. డచ్చివారితో ఎక్కువ వ్యాపారం చేసేవారు. తుర్కిస్థాన్, అరేబియా, పాఠశక వ్యాపారులతో, కూడా వాణిజ్యం జరిగేది ఎగుమతి, దిగుమతులు జోరుగా సాగేవి అందుచేత "తెలంగాణము ఈడప్పువలె ప్రపంచపు అన్నారు.
 ఈ) ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన కలిగే ఇబ్బందులు ఏమిటి?  
 జ.పట్టణాల్లో జనాభా అధికమవడం వల్ల కలిగే ఇబ్బందులు
•ఉండేందుకు స్థలాలు సరిపోవడం లేదు •తాగేందుకు నటికి అవస్థ ఏర్పడుతుంది.
•జనాభా అధికమవడం వల్ల వాహనాల సంఖ్య పెరిగి కాలుష్యం ఏర్పడుతుంది        
•ఖర్చులు పెరిగి పోతాయి
•నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతాయి.
. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) గోలకొండ పట్టణము విశిష్టతను తెలుపండి.
జ.భారత దేశంలోని దక్షిణా పథంలో ఏకైక పట్టణంగా ప్రసిద్ధిగాం చింది ఈ గోలకొండ పట్టణం గోలకొండ మూడు కోట లుగా ఉండేది. మొదటి కోట, రెండోకోటల మధ్య ఈ గోలకొండ పట్టణం విస్తరించుంది దుర్గానికి సుమారు ఏడుమైళ్ళ పరిధిలో, ఎనభైడు. కుజులు, ఎనిమిది ద్వారాలు ఉండేవి. విశాలమైన వీధులు, మొహర్లలతో ఈ పట్టణంవుండేది. ధనవంతులు భవనాలు, ఉద్యోగస్తుల గృహాలు మరియు ఫకీర్లకు కూడా ఇళ్ళు ఉండేవి. ఆలయాలు, మసీదులు, స్నాన మందిరాలు, ఉద్యాన వనాలు ఉండేవి. తోటలు, పాఠశాలలు, జలాశయాలు, నీటి కాల్వలు అంతరాళనందనాలు ఉండేవి. ఇవి బాబిలోనియా లోని నందనాన్ని పోలి వుండేది. పట్టణంలో 'నగీన బాగ్' అనే అందమైన ఉద్యానవనం వుండేది. పట్టణంలోని సరుకులు బంజారా దర్వాజా గుండా వచ్చేవి. యుద్ధ భటులకు రెండు బారసులు ఉండేవి. ఈ పట్టణం అందంగా తీర్చి దిద్దడానికి కూలీకుతుబ్షా పాదుషాలు మంచి శ్రద్ధ తీసుకున్నారు. పట్టాన ప్రజలకు కటోరాహవూడు ద్వారా శ్రద్ధ తీసుకున్నారు. పట్టాన ప్రజలకు కటోరాహవూరు ద్వారా. మంచినీరు సరఫరా చేసి ఏర్పాటు, పుండేది. ప్రజలంతా వినోదాలతో భోగలాలసులై వుండేవారు.

3.కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.
అ) ఏదైనా ఒక పట్టణం లేదా ఊరి చారిత్రక / సాంస్కృతిక విశేషాలతో వ్యాసం రాయండి.
జ.సూర్యాపేట పట్టణం భానుపురి అని కూడా పిలువబడింది ఇ తర్వాత క్రమంలో సూర్యాపేటగా మారింది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలలో అనుబంధం ఉంది. ఈ పట్టణం తెలు ముఖద్వారం అని కూడా చెప్పబడింది. సాహితీ పరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు ఉంది. 1928లో సూర్యాపేటలో ఆంధ్రసభలు వామన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.