TS CLASS 10 TELUGU 9 LESSON జీవనభాష్యం


కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి
అ) "చెరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది" అంటి త్యాగం చేసేవారి, మంచిపనులు చేసే వారి పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలుస్తాయి అని అర్థం. అందుకోసం ఎట్లాంటి మంచిపనులు చేయాలి?
జ:- తోటి మనిషి కోసం చెరగని సహాయం చెయ్యగలగటమే మంచిపని అనిపించు కుంటుంది.
1) త్రాగు నీటి వసతి కోసం చెరువు, బోర్లు వంటివి తవ్వించటం
2) రోడ్లు వేయించటం, ఆకలితో ఉన్నవార్కి నిత్యము అన్నదానం చేయించటం
3) కళాశాలలు, ఆసుపత్రులూ, సత్రాలు కట్టించటం
4) కవిత్వాన్ని అంకితం తీసుకోవడం . సాహితే పోషకులుగా ఉండగల్గటం
5) దానాలు చేయగలటం వంటివి చెరగని త్యాగాలుగా మిగుల్తాయి.
6) ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి
7) చదువుకోవాలనుకునే వారందరికీ ఉన్నత విద్యలు అభ్యసించారా సహాయం చేయాలి.
8) పాఠశాలలను ఏర్పాటుచేసి ఉచిత విద్యను అందించాలి

ఆ."ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు" అనే వాక్యం ద్వారా విద్యార్థులకు 'సినారె' ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు?
ఎడారిని ఎవరూ దున్నటానికి, వ్యవసాయం చేయటానికి సాహసించరు. పైగా అక్కడ నీరు దొరకదు దిబ్బలు కావటం వలన నీరు పెట్టినా సమంగా ప్రవహించదు
అలా అని నిరాశతో వదిలేస్తే అసలు పంట అనే మాటకే అవకాశం ఉండదు కనుక కష్టించి పనిచేస్తే విజయం తథ్యమని సి.నా.రె అభిప్రాయం
విద్యార్థులు కొందరు నాకు గణితం కష్టమని
అనుకుంటూ శ్రద్ధగా చదవరు అలా కాకుండా కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించగలరని విద్యార్థులకు సందేశం ఇచ్చారు

2) మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది' అని సినార్ ఎందుకు అని ఉంటాడు?
జ: కవి ఆచార్య సి.నా.రె ఈ మాట అనడం వెనుక ఉద్దేశం - మనుషులంతా కలిసి ఉన్నప్పుడే 'ఊరు' అనే మాటకు అర్థం ఊరంటే పది ఇళ్లు కాదు, ఇళ్లలోని మనుషులు కలిసిమెలిసి జీవిస్తూ ఒకరి బాధలు ఇంకొకరు అర్థం చేసుకోవడం. పరస్పర సహకారంతో ఊరిని అభివృద్ధి చేసుకోవడం అందరూ కలిసి ఆనందాలను పెంచుకోవడం, సామూహిక కార్యక్రమాలూ, ఉత్సవాలూ నిర్వహించుకోవడం

కింది ప్రశ్నలలో ఒకదానికి పది వాక్యాల్లో జవాబు రాయండి
 అ) 'జీవన భాష్యం' అందించే సందేశాన్ని వివరించండి
జ. జీవన భాష్యం అనే పాఠం ద్వారా సినారె' గారు మానవాళికి అందించిన సందేశ
1. మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలు దేరినప్పుడు ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం మనల్ని భయపెడుతుంది. ఆ మాటలకు మనం భయపడకుండా ముందుకు నడిస్తే మనకు విజయం తప్పకుండా లభిస్తుందనీ, క్రమంగా అది నలుగురికి దారి అవుతుందనీ సందేశం ఇచ్చారు.
2. బీడు నేలల్లో ఏ పంటలూ పండవానీ, వె (ప్రయత్నం చేయకుండా నిరాశతో ఉండకూడదనీ, కష్టపడి ఆ నేలను దున్ని, విశ్వాసంతో విత్తనాలు నాటితే, ఆ నేలలో కూడా మంచి పంటలు పండుతాయని సందేశం ఇచ్చారు.
3. నలుగురు మనుషులు కలిసి పరస్పరం సహరించుకుంటూ జీవించడం ఉత్తమ సాంఘిక జీవనం అనీ, సాటి మనుషుల పట్ల మనం సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలని, అటువంటి మనుషులందరూ కలిస్తేనే, ఒక ఊరు ఏర్పడుతుంది సినారె సందేశమిచ్చారు.
4.మనకు ఎంతో సమర్ధత, అధికారం, సంపదలున్నా, మనం ఎన్ని విజయాలు సాధించినా, ఇకపై ఏ కష్టాలూ, బాధలూ రావని ధైర్యంగా ఉండలేమనీ, విధి ఎప్పుడు వె కష్టాలు కలిగిస్తుంది, సమస్యలను తీసుకువస్తుందో, ఏ పరీక్షలు పెడుతుందో మనం ఊహించలేమనీ విధి శక్తిముందు ఎవరైనా తలవంచాల్సిందే అని సందేశమిచ్చారు.
5.  మంచి పేరు పొందామనీ, బిరుదులూ, సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన గుర్తింపులేదని, మానవులందరికీ పనికి వచ్చి గొప్పపని త్యాగం చేస్తేనే ఆమనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలబడుతుందన సినారె సందేశం ఇచ్చారు.

. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ రాయండి 'జీవన భాష్యం' గజల్లోని అంత్య ప్రాసల ఆధారంగా సొంతంగా ఒక వచన కవితను రాయండి

...............నీరవుతుంది
...............దారవుతుంది
...............పైరవుతుంది
...............ఊరవుతుంది
...............ఏరవుతుంది
...............పేరవుతుంది

జ. ఎండిన గొంతుల తడిపేదే నీరవుతుంది.
పదుగురు నడిస్తే దారవుతుంది
ప్రతి మొక్క కాస్తే పైరవుతుంది.
నలుగురు కలిసుంటే ఊరవుతుంది.
చుక్క చుక్క కలిసి పరువుతుంది.
శాశ్వతంగా నిలిస్తే పేరవుతుంది
లేదా
ఆచార్య సి. నారాయణరెడ్డి గారు ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఏం తెలుసుకోవాలనుకొంటున్నారో ప్రశ్నలు రాయండి
జ: 1.మీ రచనల్లో మీకు వెదంటే ఎక్కువ ఇష్టం?
2.విశ్వంభరలో దేని గురించి వివరించారు?
3. మీకు బాగా ఇష్టమైన సాహిత్య ప్రక్రియ ఏది? 4. మేమూ గజల్స్ రాయాలంటే ఏం చేయాలి 5. తెలుగు భాష పైన పటు రావాలంటే మేం ఏమేం పుస్తకాలు చదవాలి