TS CLASS 10 TELUGU LESSON 11 భిక్ష


కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి
 (అ) వాదం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరు పై మీ అభిప్రాయం రాయండి.
జ. వ్యాస మహర్షి, సమస్త వేదశాస్త్ర విద్యలకు గురువు శాంతము... మరి వంటి గుణాలు ఉండవలసిన వ్యాస మహర్ష గొప్ప ఋషి. ఈ విధంగా కోపపడడం శపించడానికి సిద్ధపడడం, నాకు నచ్చలేదు. వ్యాసుడు శాంతమూర్తిగా ఉండాలి. మహర్షులు వంటివారు ఉపవాసం వంటి నియమాలు పాటించాలని నా అభిప్రాయం. వారు దొరకిన కాయగూరలతో, సెవ్వరి ధాన్యంతో తృప్తి పడాలని నా అభిప్రాయం వ్యాస మహర్షి తన శిష్యుల పై చూపిన ఆదరానికి నాకు ఎంతో ఆనందం కలిగింది. వ్యాసమహర్షికి గల శిష్య వాత్సల్యం, నాకు ఎంతో నచ్చింది.

ఆ) సేఁడు నిన్నటికి మయనండు నక్కునంబు' అను మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు? వీటి అంతరార్ధమేమిటో వివరించండి. 
జ.సామాన్య స్త్రీ రూపంలో కనిపించన పార్వతీదేవితో వ్యాసుడు ఈ మాటలు అన్నాడు. పార్వతీ దేవి భోజనానికి ఆహ్వానించినప్పుడు శిష్యులను వదిలేసి తాను తినలేనని చెబుతాడు. 'ఈ రోజు నిన్నటికి తరువాత రోజు అన్నది నిజం - అంటే నన్ను ఎలాగైతే భోజనం లేక పస్తున్నామో అలాగే ఈ రోజు కూడా ఉంటమని అర్థం.

ఇ) ఆకలి వల్ల వ్యాసుడు కాశీనగరావు శపించాలనుకున్నాడు కదా! ఆకలి మనిషి విచక్షణను నశింపచేస్తుంది' అనే దాని గురించి రాయండి. 
జ. సమస్త ప్రాణులు ఆహారాన్ని తిని జీవిస్తాయి. "ఆహరం తినకపోతే ప్రాణాలు నిలవవు. ఆకల నుండి కోపం కలుగుతుంది. కోపాన్ని జయించరు అంత తేలికకాదు. కోపం వస్తే మనిషి రాక్షసుడవుతాడు. తామ ఏం చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అనే విచక్షణనను కోల్పోతాడు. తన వారికి కూడా దూరమవుతాడు. భిక్ష పాఠ్యభాగంలోని
వ్యాసుడు గొప్పజ్ఞని రెండురోజులు భక్షదొరకలేదని కాశీనగరాన్నే శపించాలనుకున్నాడు. కాబట్టి ఆకలి బాధ మనిషిని ఎంత చెడు పనుల చేయడానికైనా (ప్రేరేపిస్తుంది. అందువల్ల ఆకలితో ఉన్నవారికి ఆహరం పెట్టడం మన కర్తవ్యం.

2 కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) భిక్ష పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.
జ. వ్యాసుడు సకల విద్యలకూ గురువు ఒకరోజు మధ్యాహ్న వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీ నగరంలో (బ్రాహ్మణ వాడలలో బిక్షాటనం కోసం వెళ్ళారు. ఏవో కారణాలు చెప్పి, ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉండామనే. మరుసటి రోజు భిక్ష, తప్పక దొరుకుతుందన వ్యాసుడు నిశ్చయించాడు. ఈశ్వరుడి మాయవల్ల మరుసటిరోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భక్ష పాత్ర నడివీధిలో పగులకొట్టి, కాశీ వాసులకు మూడు తరాల పాటు ధనం మోక్షం, విద్య లేకపోవుగాక అని శపించబోయాడు. ఇంతలో పార్వతే దేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమయి, వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు "సూర్యుడు అస్తమిస్తున్నాడు నాకు పదివేలమంది శిష్యులున్నారు. వారు తినకుండా నేను తనను
ఈ రోజు కూడా నన్నటి లాగే వస్తుంటాను" అన్నాడు. అప్పుడు పార్వతీదేవి నవ్వి "నీవు శిష్యులందరికీ వెంట తీసుకొని రా॥ ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా, కావలసిన పదార్థాలు పెడతాను' అని చెప్పింది.
"వ్యాసుడు సరే అని, 'శిష్యులతో గంగలో స్నానం చేసి వచ్చాడు. వార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజనశాలలో వారందరికి భోజనం పెట్టింది.
ఆ కోపంవల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి.
జ.కోపం వచ్చిన మనిషిలో మంచిచెడ్డలను గ్రహించే విచక్షణ జ్ఞానం నశిస్తుంది. మనిషిలో రాక్షస ప్రవృత్తి పెరిగిపోతుంది. ఎలాగైనా ఎదుటివాడిని కష్టపెట్టాలనీ, ఎదుటివాడికి కష్టం కల్గించాలనీ. బుద్ధి కలుగుతుంది కోపం వచ్చిన మనిషి పశువులా సంచరిస్తాడు. కోపంతో కళ్ళు మూసుకుపోతాయి. కోపము శత్రువు వంటిది అని భర్తృహరి చెప్పాడు. "తన కోపమె తన శత్రువు" అని సుమతీ శతక కర్త కూడా చెప్పాడు. కోపం వల్లే వ్యాసమహర్షి, కన్నతల్లి వంటి కాశీనగరాన్ని శపించబోయాడు. కోపంతో దూర్వాసుడు విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఎన్నో కష్టాలు పడ్డారు కోపం వల్ల జ్ఞానం నశిస్తుంది. తమోగుణం పెరిగిపోతుంది. కోపం వల్లనే, పాపకార్యాలు. చేయడానికి మనిషి సిద్ధపడతాడు.

3.కింది అంశాలను గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి. 
అ) భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష.. వంటి పదాలతో ఒక చక్కన భావాన్ని ప్రకటించే కవిత రాయండి.
జ.వచన కవిత:-
నేనిస్తా మిత్రమా! సలహాలు నీకు లక్ష్మ తోడివారిపై పెంచుకోకు, నీవు కక్ష 
ఉండాలి మరి మనకు సదా తితిక్ష 
మంచిచెడ్డలు మనం చెయ్యాలి సమీక్ష చెడ్డపనులు చేస్తే తప్పుడు మనకు శిక్ష ఉంటుంది మనపై నిత్యం దైవం పరీక్ష
 ఉండాలి యోగ్యుడు కావాలనే గట్టి దీక్ష మనందరికీ దేవుడే శ్రీరామరక్ష 
 ఎందుకు మనలో మనకు ఈ వివక్ష 
 పుట్టించిన దేవుడే వేస్తా ఉంత భిక్ష