TS CLASS 10 telugu LESSON 7th lesson శతక మధురిమ


శతక మధురిమ

వ్యక్తీకరణ - సృజనాత్మకత
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడంటే ఎట్లా ఉండాలి?
 జ. అపూర్వ కీర్తివంతుడు త్యాగశీలియై ఉండాలి. దేశంకోసం తన జీవితాన్ని కుటుంబాన్ని సర్వస్వాన్ని వదిలిపెట్టే విధంగా ఉండాలి. దేశం మనకేమి ఇచ్చింది అని కాదు మనం దేశానికేమిచ్చాం అనే తత్వం కల్గి ఉండాలి. కీర్తి కోసం పరుగులు తీసేవాడు. కారాదు. అందరివాడై ఉండాలి. అరిషట్ వర్గాలను జయించినవాడై ఉండాలి. అహంభావం లేకుండా ఉండాలి.

 ఆ) త్యాగి లక్షణాలెట్లా ఉంటాయి?
జ.  నిజమైన త్యాగి అనగా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎదుటి వ్యక్తికి తన సర్వస్వాన్ని ధారపోసేవాడు నిజమైన త్యాగి. అతడు ఆడినమాట తప్పనివాడై ఉంటాడు. పరులకు సేవను చేసేవాడు. నిస్వార్థపరుడు, తన దగ్గర సంపద లేకున్నా మేఘం వలె ఇతరుల దగ్గర తెచ్చి ఇచ్చే స్వభావం కలవాడు.
 
 ఇ)మిత్రుడు పుస్తకంవలె మంచిదారి చూపుతాడని ఎట్లా చెప్పగలవు?
జ. మిత్రుడు, స్నేహితుడు మనకు మంచిని చేకూర్చేవాడు మన స్నేహితుడు. పుస్తకాలు కొన్ని మాత్రమే చదువగలము కొన్నిం మాత్రమే మన దగ్గరుంటాయి. వేల పుస్తకాల కన్నా మిత్రుడు గొప్పవాడు ఎలా అనగా మనకు వెన్ను దన్నుగా నిలిచి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి మంచి బాటను వేయగలవాడు మిత్రుడు పుస్తకాలు చదవగలము మిత్రుడు చెప్పగలడు. పుస్తకాలతో ప్రపంచ విజ్ఞానమంతా దాగి ఉంది. అలాగే మిత్రునిలో మన తప్పు ఒప్పులు దాగి ఉంటాయి. కావున మనకి మిత్రుడు పుస్తకాలవలె మంచిదారి చూపగలడు.

ఈ) పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా! మరి చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు?
జ: చదువు విషయంలో శ్రద్ధ కావాలి (క్రమశిక్షణ కావాలి గురువులపట్ల గౌరవభావం ఉండాలి. గురువుల పై నమ్మకం ఉండాలి. చెప్పినదానిని అభ్యాసం చేయాలి. ఏకాగ్రత కావాలి. అల్లరి విడిచిపెట్టాలి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి
జ. శతక పద్యాలు జీవన మార్గాలు ఎందుకంటే...
 1. జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది.
2. మంచి విషయాలు, చెడు విషయాల మధ్య తారతమ్యం తెలుస్తుంది.
3. చెడు ఆలోచనలతో జరిగే నష్టం తెలుస్తుంది.
4. గౌరవ భావం అలవడుతుంది.
5. భక్తి, నిజాయతీ పెంపొందుతాయి.
6. కీర్తి పొందాలంటే ఎలా ఉండాలో తెలుస్తుంది.
7. ప్రవర్తనలో జరగాల్సిన మార్పులను నేర్పిస్తాయి.
8. మనిషిలోని రాక్షస గుణాలు తొలగిపోతాయి. 
9. దేశభక్తి, గురుభక్తి అలవడుతుంది.
10. ప్రతి పద్యం ఒక సందేశాన్ని బోధిస్తుంది.
11. తప్పు చేస్తుంటే హెచ్చరిస్తుంది..
12. నడవడి ఎలా ఉండాలో సూచిస్తుంది...
13. జీవితాంతం వరకు మంచి మార్గాలను చూపిస్తాయి.